రికార్డుల రారాజు…తెలుగు చిత్రసీమకు సుప్రీం

-

అబ్బే చిరంజీవి మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే….కుర్ర హీరోల పోటీ తట్టుకోలేడు. అసలు సినిమాకు మినిమం కలెక్షన్లు రావడం కూడా కష్టమే. ఈ వెటకారపు మాటలు మెగాస్టార్ చిరంజీవి తనకు సరిపడని రాజకీయాల్లో విఫలమయ్యి…మళ్ళీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు వచ్చినవి. సినిమా రంగానికి 10 సంవత్సరాల పాటు దూరం కావడంతో మళ్ళీ చిరంజీవి సినిమాల్లో రాణించలేరు అనుకున్నారు.

కానీ నవ్విన నాపచేను పండుతుంది అన్నట్లుగా చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో విమర్శలు చేసిన అందరి నోళ్ళు మూయించాడు. బాహుబలి సినిమా తర్వాత యంగ్ హీరోలకు వంద కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టుకోలేక కష్టపడుతున్న సమయంలో ఖైదీ సినిమాతో వంద కోట్ల ఫిగర్ క్రాస్ చేసి సరికొత్త నాన్ బాహుబలి రికార్డు సృష్టించి మళ్ళీ తెలుగు చిత్రసీమలో తానే నెంబర్ 1 హీరో అని నిరూపించాడు.

అసలు 80వ దశకంలో ఎన్టీఆర్, ఏ‌ఎన్‌ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్రహీరోల మధ్య చిరంజీవి నటుడుగా అరంగ్రేటం చేసి….అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరో స్థానాన్ని కొట్టేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు చిత్రసీమని ఏలుతూ అగ్రస్థానంలోనే నిలుస్తూ వస్తూ…అప్ కమింగ్ హీరోలకు రోల్ మోడల్ గా నిలిచారు. అయితే కుర్ర హీరోలు ఎంతమంది వచ్చిన చిరణజీవి స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఇదే సమయంలో చిరంజీవి ప్రజలకు ఏదో మంచి చేయాలని తనకు తెలియని రాజకీయాల వైపు వెళ్లారు.

అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ 1 స్థానం కోసం పెద్ద యుద్ధమే జరిగింది. మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ లు నెంబర్ 1 స్థానం కోసం పోటీపడ్డారు. కానీ చిరంజీవి స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. మళ్ళీ ఆయనే రాజకీయాలని పక్కనబెట్టి, కన్నతల్లి లాంటి చిత్రసీమలో కాలు పెట్టి, ఖైదీ 150 సినిమాతో వంద కోట్ల కలెక్షన్లని పట్టి ఖాళీగా ఉన్న నెంబర్ 1 సీటులో దర్జాగా కూర్చున్నారు. ఇక ఇప్పుడు ఈయన సెట్ చేసిన వంద కోట్ల టార్గెట్ ని రీచ్ అయ్యేందుకు మిగతా హీరోలు పోటీపడుతున్నారు. నాన్ బాహుబలి పేరిట సెట్ చేసిన ఈ రికార్డుని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఒక్కడే రంగస్థలం సినిమాతో బద్దలగొట్టాడు.

ఇక తనయుడు రికార్డుని బద్దలగొట్టడానికి మెగాస్టార్ ‘సైరా’ సినిమాతో మన ముందుకొచ్చేస్తున్నారు. అక్టోబర్2 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతున్న సైరా…300 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఈ టార్గెట్ రీచ్ కావడం చిరంజీవికి పెద్ద కష్టమైన విషయం కాదని ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో చిరంజీవి ఎప్పటికి ‘సుప్రీం’ హీరోనే.

Read more RELATED
Recommended to you

Latest news