ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లో రెండవ విడతగా మూడు ఫైటర్ జెట్లు అంబాలా చేరుకున్నాయి..ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ మూడు రఫేల్ యుద్ధ విమానాలు ఈ రోజు రాత్రి 8:13కు అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యాయి..రఫేల్ యుద్ధవిమానాలు రావడంతో అంబాలా ఎయిర్‌బేస్ వద్ద దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు..భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఇటివలే భారత అమ్ముల పొదిలో చేరాయి..రెండోదశ యుద్ధ విమానాలు ఈరోజు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్‌కు చేరుకున్నాయి.దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రఫేల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి..ఫ్రాన్స్‌కు చెందిన దసాల్డ్ కంపెనీ తయారు చేసే ఈ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలుచేసింది..మొత్తం 36 రాఫెల్ విమానాలను 60 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది..దీంట్లో 30 రఫేల్ ఫైటర్ జెట్స్, ఆరు ట్రైనీ విమానాలు ఉన్నాయి..ముందుగా ఫ్రాన్స్ 5 రఫేల్ విమానాలను భారత్ కు అప్పగించింది..ఇప్పుడు మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు అప్పగించడంతో మొత్తం 8 యుద్దవిమానాలు భారత్‌కు చేరాయి..దీంతో భారత రక్షణ రంగం మరింత బలంగా మారింది..యుద్ధం చేయడంలో రఫేల్ విమానాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.