దిశ కమిషన్ విచారణపై తెలంగాణ హై కోర్టు సంచలన నిర్ణయం

-

దిశ కమిషన్ విచారణ పై తెలంగాణ హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దిశ కమిషన్ విచారణ ప్రక్రియ లో జోక్యం చేసు కోలేమని తేల్చి చెప్పింది హై కోర్టు. అంతే కాదు దిశ కమిషన్ విచారణ తీరు పై దాఖలైన పిటిషన్లు కొట్టి వే సింది తెలంగాణ హై కోర్టు. డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహా రెడ్డి పిటిషన్లు కొట్టి వేసింది హై కోర్టు.

దిశ కమిషన్ విచారణ చట్ట విరుద్దంగా జరుగుతోందన్న వాదన తోసి పుచ్చింది. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలన్న అభ్యర్థనను నిరాకరించింది తెలంగాణ హై కోర్టు. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్ కు ఉంటుందని హై కోర్టు సపస్తం చేసింది.

కాగా… దిశ ఎన్కౌంటర్ కేసులో… దిశ కమిషన్ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. దిశ కేసులో భాగంగా నలుగురు నిందితులను.. పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా… ఈ ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తోంది దిశ కమిషన్. విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ ఐఏఎస్ సజ్జనర్ మరియు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను విచారణ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news