2025 తర్వాతే ఎలక్ట్రిక్ కార్…క్లారిటీ ఇచ్చిన మారుతి సుజుకీ

-

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరల కారణంగా వినియోగదారులు ప్రత్యామ్నాల వైపు చూస్తున్నారు. దీంట్లో భాగంగానే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( ఈవీ) అమ్మకాలు జోరందుకుంటున్నాయి. కానీ భారతదేశ కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ మాత్రం 2025 తర్వాతే ఈవీలను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశాారు ఆ సంస్థ చైర్మన్ ఆర్.సీ. భార్గవ. తాము నెలకు పదివేలకు పైగా ఈవీ వాహనాలు అమ్మే సమయం వస్తే తప్పా ప్రస్తుతం ఈవీ కార్లను తయారుచేయబోం అని తెలిపారు. బహుషా అది 2025 తరువాతే ఉంటుందన్నారు. మారుతి ప్రస్తుతం సీ ఎన్ జీ మోడళ్లపై మాత్రమే ద్రుష్టి సారిస్తున్నట్లు తెలిపారు. భారత దేశంలో రూ. 10 లక్షల రేటులో మంచి బ్యాటరీ సామర్థ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారీ చేయడం కష్టమని భార్గవ వెల్లడించారు. దేశంలో ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా మరింతగా పెరగాలన్నారు. ప్రస్తుతం దేశంలో మరో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. టాటా నెక్సాన్, టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో టాటా ఆల్ట్రోజ్ లో కూడా ఎలక్ట్రిక్ మోడల్ ను తీసుకురానున్నట్లు తెలస్తోంది. ప్రస్తుతం ఈ మోడళ్ల ఎలక్ట్రీక్ వాహనాలు మార్కెట్ లో హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. కారు బుక్ చేసుకున్న నాలుగైదు నెలలకు గానీ డిలవరీ కావడం లేదంటే టాటా ఈవీ కార్లకు ఉన్న డిమాండ్ ఏమిటో తెలుస్తోంది. మరోవైపు ఎంజీ సంస్థ జెడ్ ఎస్ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. దీనికి కూడా మార్కెట్ ల మంచి డిమాండ్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news