హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలి : ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ !

-

హుజురాబాద్ ఎన్నికలు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ కి వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ ఇవ్వాలని భావిస్తున్నారు.

congress
congress

అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్ లో ఓటర్లను టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొనుగోలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఓటుకు 6 వేల రూపాయల నుంచి 10 వేల వరకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తున్నారని ఆధారాలతో ఏ సందర్భంగా ఫిర్యాదు చేయనుంది కాంగ్రెస్.

బహుమతులు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు, అధికార దుర్వినియోగం తదితర అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్.. మూడు గంటల్లో లక్షన్నర మంది ఓటర్లకు 90 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందని, ఇంత ఘోరంగా విచ్చలవిడిగా అడ్డగోలు అక్రమాలు, ఎన్నికల నిబంధనల అతిక్రమణలు ఎక్కడా జరగలేదని ఆరోపణ లతో ఫిర్యాదు చేయనుంది కాంగ్రెస్. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక.. అక్టోబర్ 30 వ తేదీన జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news