తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్..!

-

తెలంగాణ తల్లిగా సోనియాగాంధీ విగ్రహం పెట్టడం లేదు కదా..? అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడితే చేసేది ఏమి లేదని పేర్కొన్నారు. విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటున్నారు కేటీఆర్. పదేళ్లు మూత పడ్డ కాలేజీలు తెరిచామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కి మేము అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంవో లో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా..? అని ప్రశ్నించారు.

MP Laxman
MP Laxman

ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను లాక్కుంది కేసీఆర్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో భూములు లాక్కొని కలెక్టర్ కార్యాలయం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్, హరీశ్ రావు పర్యటన ఉందంటే.. హౌస్ అరెస్ట్ చేసే వాళ్లు అని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అగ్రగామిగా తీర్చిదిద్దబడుతోందని పేర్కొన్నారు ఎంపీ లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news