రాజకీయాల్లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరి కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా సరే ఆయన వ్యూహాలు పెద్దగా ఎవరికి అంతుబట్టే పరిస్థితి ఉండదు. ఎవరిని ఎలా నొక్కాలో, ఎవరిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆయనకు తెలిసిన విధంగా మరో నేతకు తెలియదు అనేది వాస్తవం. రాజకీయంగా కెసిఆర్ వేసిన చాలా అడుగులు ఆశ్చర్యంగానే ఉంటాయి. తెలంగాణా రాజకీయాల్లో కెసిఆర్ అందుకే ఎదుర్కొనే నేత లేరని అంటూ ఉంటారు.
తాజాగా రాజ్యసభ సీటు విషయంలో ఆయన అనుసరించిన వ్యూహం ఇదే విధంగా ఉంది అనేది వాస్తవ౦. ముందు నుంచి అసలు కేకే పేరు వచ్చింది గాని సురేష్ రెడ్డి పేరు ఎక్కడా వినిపించలేదు. కాని అనూహ్యంగా కెసిఆర్ ఆయన్ను ఎంపిక చేసారు రాజ్యసభకు. ఈ ఎంపిక గురించి ఎవరికి అసలు అంచనా లేదు. ప్రచారంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు వంటి వారిని పక్కనపెట్టి సురేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
దీని వెనుక కీలక వ్యూహం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. సురేష్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేత. ఆయనకు బలమైన వర్గం కూడా ఉఉంది. అక్కడ ఉన్న నేతలు ఎవరూ అంత సమర్ధులు కాదు. బలంగా ఉన్న కవిత కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఈ తరుణంలో కెసిఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ లో బిజెపి బలపడే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంది.
దీనితో సురేష్ రెడ్డి అయితే అందరిని ముందు ఉండి నడిపిస్తారని, ఆయనకు పదవి ఇస్తే జిల్లా నేతల్లో కూడా ఒకరకమైన ఉత్సాహం వస్తుందని భావించిన కెసిఆర్ ఆయనను రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సౌమ్యుడి గా పేరు ఉంది. అలాగే మంచి వక్తగా కూడా పేరుంది. ఈ వ్యూహం ఒకరకంగా బిజెపికి షాక్ ఇచ్చే నిర్ణయమే అని చెప్పుకోవాలి. భవిష్యత్తులో సురేష్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.