శ్రీకృష్ణ కుచేల స్నేహబంధం అజరామరం !!

-

శ్రీకృష్ణుడు కుచేలుడు బంధం విడదీయరానిది. కుచేలుడు శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు, బలరాముడు, సుధాముడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేస్తారు. విద్యాభ్యాసం అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామం చేరుకొన్నాడు.

కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా పెద్ద సంతానం కలుగుతుంది. బండెడు సంతానంతో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే కుచేలుడి ‘”భార్య లోక రక్షకుడైన శ్రీకృష్నుడిని దర్శనం చేసుకొని రమ్మంటుంది'”. కుచేలుడు ద్వారకా నగరం పోయేముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారక నగరం చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడతాడు. తన మదిలో లోక రక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. శ్రీ కృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు.

అతిథి మర్యాదలు అన్ని పూర్తయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి మన గురుపత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షం పడడం వల్ల ఎంతకు రాక పోవడం వల్ల మన గురువుగారు మనల గురించి ఎంత ఆందోళనపడిన విషయం గుర్తుచేసుకుంటారు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచుతుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికి ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు గుప్పెటితో తిన బోతుండగా రుక్మిణి స్వామి మీరు మొదటి సారి అటుకులు తినడంవల్లే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పవిత్రమైన ప్రేమకు ప్రతీక అయిన శ్రీకృష్ణ కుచేల స్నేహబంధం మననం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఆ స్వామి దయ మనపై వర్షిస్తుంది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news