ఆ విషయంలో జగన్ ని అభినందిస్తున్న అమరావతి రైతులు… కొత్త సూచన!

-

ప్రస్తుతం ఏపీలో కరోనా కష్టాలు ఒకెత్తు.. జరుగుతున్న ప్రమాధాలు మరొకెత్తు అయితే… మూడు రాజధానుల విషయం, రైతుల ఆందోళన, టీడీపీ నేతల ఆన్ లైన్ ఆందోళనలు ఇంకొకెత్తు! ఈ విషయంలో నెలరోజుల కిందటే 200రోజులకు రాజధాని రైతుల ఆందోళనలు చేరాయని చెబుతున్న తరుణంలో… రాజధాని రైతులు కూడా పూర్తిస్థాయిలో రాజకీయ విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… విమర్శించే ఉద్దేశ్యంతో మొదలుపెట్టినా కూడా, ఆ మాటల్లో జగన్ ని అభినందించిన అంశం కనిపించింది!

అవును… తమకు ఏమి కావాలి? అది సాధ్యంకాని పక్షంలో మరో ఆల్టర్ నేటివ్ ప్రభుత్వం ముందు ఏమి ఉంచాలి? తమకు అన్యాయం జరగకుండా ఎలా గట్టెక్కాలి? వంటి ఆలోచనలు చేయడంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు అనే విమర్శను మూటగట్టుకున్న రాజధానీ రైతులు… ఏపీ రాజధానిని పూర్తిగా అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో… తమ ఆందోళనలు 237వ రోజుకు చేరినా కూడా జగన్ సర్కార్ తమ బాదలను అర్ధం చేసుకోవడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో… తాజాగా విజయ్వాడ కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాధాన్ని ప్రస్థావించారు రైతులు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అగ్నిప్రమాదం జరిగిన గంటలో స్పందించి బాధితుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్… అమరావతి రైతుల విషయంలో 200రోజులకు పైగా ఆందోళనలు చేరిన తరుణంలో ఎందుకు స్పందించడం లేదని అంటున్నారు. దీంతో… రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా.. ఎలాంటి ప్రమాధం జరిగినా గంటలోపే సీఎం స్పందిస్తున్నారని చెప్పడం శుభ సూచకమని అంటున్నారు వైకాపా నేతలు. అలాంటి సీఎంపై రాజకీయ పార్టీల్లాగా… ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందనే ఉపయోగం లేని విమర్శలు చేయడం కంటే.. ప్రభుత్వం చర్చలకు పిలుస్తున్నప్పుడు వెళ్లి మాట్లాడుకోవడం బెటర్ కదా అని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు!!

అవును… ఈ సమయంలో పనికిమాలిన రాజకీయ లబ్ధికోసం రైతుల జీవితాలతో ఆడుకునే నాయకుల మాటలకు తలాడించకుండా రైతులు సొంతంగా ఆలోచించాలని… ప్రభుత్వంతో చర్చలు జరుపుకుని, తమకు న్యాయం జరగకపోయినా, అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలని రాజధాని రైతుల శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news