టార్చర్ చేస్తే పని చేయలేం, ఉన్నతాధికారులపై కర్నూలు జిల్లా వైద్యులు ఫైర్

-

కర్నూలు జిల్లాలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సస్పెన్షన్ దుమారం రేపింది. ఈ చర్యలపై నిరసన వ్యక్తం చేసారు జిల్లా వైద్యులు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు బహిష్కరించడం కూడా హాట్ టాపిక్ అయింది. కర్నూలు కలెక్టర్, డి ఎం హెచ్ ఓ ను కలసి వినతిపత్రం ఇచ్చి వైద్యులు నిరసన వ్యక్తం చేసారు. జిల్లా ఉన్నతాధికారులు వీడియో , టెలి కాన్ఫరెన్స్ లో వైద్యులను అసభ్యకరంగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు అని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసారు.

ఇద్దరు వైద్యుల సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి అని కోరారు. వైద్యులపై ఇతర శాఖల అధికారులు పెత్తనం చేస్తున్నారు అని మండిపడ్డారు. వార్డు వాలంటీర్లకు ఇచ్చిన గుర్తింపు కూడా వైద్యులకు లేదు అని విమర్శలు చేసారు. వైద్యులకు సన్మానాలు అవసరం లేదు, మా సేవలు గుర్తిస్తే చాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్సు తోనే కాలం గడచిపోతుంది , టార్గెట్ ఎప్పుడు రీచ్ కావాలి అని నిలదీశారు. ఇలాగే టార్చర్ పెడితే పని చేయలేము అని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news