తమిళనాడు రాష్ట్రంలో త్రిభాషా విధానం రోజురోజుకూ ముదురుతోంది. కేంద్రం హిందీని తమ మీద రుద్దాలని చూస్తుందని తమిళ సర్కార్ పదే పదే వ్యాఖ్యలు చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ హిందీకి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది.
తాజాగా త్రిభాషా విధానంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ కాపీపై రూపీ సింబల్‌ను తొలగించారు. హిందీ బదులు రూపీని తమిళంలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొన్నది. కాగా, డీఎంకే సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హిందీ నచ్చకపోతే నేర్చుకోవడం మానేయాలి కానీ, భాష పేరుతో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఫైర్ అవుతున్నారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు కేవలం ఒక్క తమిళనాడే ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.