మహారాష్ట్రలోని జల్గావ్ లో దారుణ ఘటన జరిగింది. 3-12 సంవత్సరాల మధ్య వయసున్న నలుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు గుర్తు తెలియని వ్యక్తి.. తల్లి తండ్రులు పని కోసం బయటకు వెళ్ళగా నలుగురు పిల్లలను దారుణంగా చంపేసాడు. జల్గావ్‌లోని బోర్ఖేడా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తల్లిదండ్రులు, మెహతాబ్ మరియు రుమాలి భీలాలా, మధ్యప్రదేశ్ నుండి వచ్చి నివాసం ఉంటున్నారు.
పొలాలలో పని చేయడానికి ఆ గ్రామంలోకి వచ్చారు. శుక్రవారం… వాళ్ళు పని చేస్తున్న పొలం యజమాని ముస్తఫా నలుగురు పిల్లలను రక్తపు మడుగులో ఉన్నట్టు గుర్తించాడు. వారు హత్యకు గురైనట్టుగా గుర్తించారు. ఆ తర్వాత వారిని చంపినా గొడ్డలిని గుర్తించారు. పిల్లలందరినీ ఒకే గొడ్డలితో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పిల్లలను సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) గా గుర్తించారు.ప్రత్యేక ఐపిఎస్ అధికారి నేతృత్వంలో సిట్ వేసారు