132 టన్నులు బండరాయి..అయినా ఈ టెక్నిక్ తో సులువుగా మనిషి కదలించవచ్చట..!

-

ఈ భూమ్మీద ఎన్నో వింతలు..విశేషాలు..అంచుచిక్కని రహస్యాలు..ముడిపడని మిస్టరీలు. వీటిగురించి ఎప్పుడు మాట్లాడుకున్నా..ఓ కొలిక్కిరానీ..డిస్కషన్లు..ఎన్ని ఉన్నాయో కదా..ఈరోజు ఇలాంటి టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం..అదేంటో 132 టన్నుల బరువున్నా..ఈజీగా ఆ రాయిని కదపొచ్చుట..అదేలా సాధ్యం అవుతుందో చూద్దాం.

ఫ్రాన్స్‌లో కొన్ని వందల టన్నుల బరువైన పెద్ద బండరాయి ఉంది. మరి అంత బరువు ఉన్న రాయిని కదిలించాలంటే..మిషన్స్ కావాలి కదా.. కానీ, 132 టన్నుల బరువున్న ఈ రాయిని మనిషి సులువుగా కదలించొచ్చట.అర్రే అదెట్లా అనేగా మీ డౌట్..ఈ బరువైన రాయిని ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ అని పిలుస్తారు. దీన్ని ఈశాన్య ఫ్రాన్స్‌లోని హ్యూల్‌గోట్ అడవిలో గుర్తించారు.

ఈ రాయి మనిషి కంటే కొన్ని వేల రెట్లు బరువుగా ఉన్నప్పటికీ ఓ బలహీనమైన వ్యక్తి కూడా దాన్ని సులువుగా కదలించొచ్చు. అయితే, దీన్ని ఒక నిర్దిష్టమైన యాంగిల్ నుంచి కదిలించినప్పుడు మాత్రమే ఈ రాయి కదులుతుంది. పూర్తిగా శాస్త్రీయమైనది. ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ చదునుగా ఉన్న మరోరాయిపై ఉంటుంది. ఒక మూల నుంచి కదిపితే రాయి పైకి కిందికి ఊగుతుంది. ఈ రాయి ద్వారా..ఈ ప్రదేశం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారిపోయింది. దీన్ని వీక్షించటానికి ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. రాయిని కదపడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఆ టెక్నిక్‌ తెలిసిన వాళ్లకు మాత్రమే రాయి కదులుతుంది.

ఇట్లాంటి… ప్రత్యేకమైన శిల ఒకటి మన దేశంలో కూడా ఉంది. తమిళనాడులోని మహాబలిపురంలో సహజసిద్ధంగా ఏర్పడిన కృష్ణా బట్టర్‌బాల్ అనే రాయి.. ఫ్రాన్స్‌లోని ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ కంటే కూడా ఇది బరువైంది. దీని మొత్తం బరువు 250 టన్నులు. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలు వచ్చినా కూడా.. ఈ బండరాయి ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఈ రాయిని దగ్గర నుంచి చూసినప్పుడు.. ఏ క్షణంలోనైనా ఈ రాయి దొర్లుతుందోనని అనిపిస్తుందట.. ఆ బండరాయి ఉన్న ప్రదేశం చాలా ఏటవాలుగా ఉన్నప్పటికీ రాయి ఎందుకు జారడం లేదనేది అంతుచిక్కని ప్రశ్న. సాధరణంగా వాహనాలే..డౌన్ లో పార్క్ చేస్తే..బ్యాలెన్స్ ఆపుకోలేవు..అలాంటిది ఈ రాళ్లు ఇలా ఎందుకు ఉంటున్నాయో..?

Read more RELATED
Recommended to you

Latest news