హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని ట్రంప్ కితాబు..!

-

కొవిడ్ నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని తను చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సమర్థించుకున్నారు. చాలా మంది వైద్యులు కూడా తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు మలేరియా ఔషధం వాడడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నా… ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కరోనా నియంత్రణకు మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టిగా నొక్కి వక్కాణించారు. ‘కొవిడ్ నియంత్రణకు మలేరియా ఔషధం ఉపయోగపడుతుంది’ అంటూ… ట్రంప్ చెబుతున్న వీడియోలను సామాజిక మాధ్యమ వేదికలు తొలగించిన గంటల వ్యవధిలోనే ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

trump
trump

మానవాళిని కబలిస్తున్న కరోనా మహమ్మారిని హైడ్రాక్సీక్లోరోక్విన్ నియంత్రించలేదని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. శ్వేతసౌధం కూడా ఈ ఔషధాన్ని వినియోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే దీనిని ట్విట్టర్ వేదికగా ట్రంప్ వ్యతిరేకించారు. పలువురు వైద్యులు మలేరియా ఔషధాన్ని సమర్థిస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news