కిమ్ ఆరోగ్యం గురించి ఐరాసా ఏం అందంటే…

-

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆసక్తికరంగా ఉన్న అంశం. ఆయన ఆరోగ్యం గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చదువుతున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అసలు ఇప్పటి వరకు ఏ సమాచారం కూడా బయటకు రాలేదు. అమెరికా అయినా చెప్తుందా అంటే ఆ దేశం కూడా దీని విషయంలో ఏమీ స్పందించడం లేదు.

ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నాకు తెలుసు గాని నేను చెప్పను అంటూ మాట్లాడారు. ఆయన ఆరోగ్యం గురించి అనేక ప్రకటనలు వస్తున్న నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ స్పందించారు. కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆయన ఆరోగ్యంపై తమ ప్రతినిధులెవరూ కూడా ఆ దేశ ప్రభుత్వాన్ని గానీ ఆ దేశ ప్రతినిధులతోగానీ మాట్లాడింది లేదని చెప్పుకొచ్చారు.

ఆయన ఆరోగ్య౦ విషమించింది అని ఒక దేశం ఆయన మరణించారు అని ఒక దేశం ఆయన బాగానే ఉన్నారు అని మరో దేశం ఏదోక ప్రకటన చేస్తూనే ఉంది. దీనిపై ఏ విధంగా చూసినా సరే స్పష్టత మాత్రం రావడం లేదు. ఆయన కరోనా వైరస్ కి భయపడి దాక్కుని ఉండవచ్చు అని దక్షిణ కొరియా అధికారులు కొందరు మీడియాకు వివరించారు. ఆయన రాజధాని నగరానికి దగ్గరలో ఎక్కడో ఉన్నారని చెప్తుంది ఆ దేశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version