ప్రజల ఓటు విలువ వారి ఐదేళ్ల భవిష్యత్ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.చిత్తూరు జిల్లా పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. ‘ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు.. చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నా. ఒక్కడి మీద అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు . మీ ఓటు వల్ల మీ తలరాతలు మారతాయి. ఎవరి వల్ల మంచి జరిగిందో తెలుసుకుని ఓటేయండి అని అన్నారు.ఈ ఎన్నికల్లో వైసీపీకి తోడుగా ఉండండి’ అని ఆయన కోరారు.
చంద్రబాబు ఎప్పుడైనా ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ‘బడులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు చూస్తే గుర్తొచ్చేది మీ జగన్. చంద్రబాబును చూస్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని అడిగారు.బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వేశాం అని గుర్తు చేశారు. విశ్వసనీయత ఒక వైపు.. మోసం మరోవైపు ఉన్నాయి అని అన్నారు. ఏది కావాలో తేల్చుకోండి’ అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.