రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి రసాయన మందులు పైనే అధిక పెట్టుబడులు ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు.
అయితే ఈ సమస్యని పరిష్కరించాలంటే ఒక మంచి మార్గం ఉందని ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి కొన్ని సూచనలు ఇచ్చారు. కేవలం తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
ఆయన చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే భూమి లోపల పొర నుంచి తీసి ఎండబెట్టిన పది కిలోలు ఆముదం నూనె కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని టమోటా పంట, మిరప, బెండ వంటి పంటలు కి విత్తిన లేదా నాటిన పది రోజులకి మొక్కల దగ్గర పిడికెడు వేసి నీళ్లు పోస్తే చీడపీడల సమస్య ఉండదు.
ప్రతి 20 రోజులకొక సారి మట్టి ఆముదం కలిపిన మిశ్రమాన్ని మొక్కలకి అందిస్తే తెల్ల దోమ, పచ్చ దోమ, మొక్కల రసం పీల్చే పురుగులతోపాటు ఏ పురుగుల సమస్య కూడా ఉండదు. కాబట్టి రైతులు ఈ విధంగా అనుసరిస్తే మంచిది. దీంతో సులభంగా సమస్య నుండి బయటపడవచ్చు. చీడపీడల బాధలు తగ్గి రైతులు చక్కగా పంటలు పండించుకోవచ్చు. దీనితో పంటలకు ఎలాంటి నష్టం కూడా ఉండదు.