లాక్ డౌన్ సమయంలో కరోనా రోగులకు మినహా ఎవరికి కూడా వైద్య సదుపాయాలు అందడం లేదు. గర్భం తో ఉన్న మహిళలు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఒక మహిళ లాక్ డౌన్ లో ప్రసవించడానికి చాలా ఇబ్బంది పడింది. అస్సాం ధెమాజీ జిల్లాలో ఒక మహిళ తయారు చేసిన పడవలో ఒక బిడ్డను ప్రసవించింది.
ఈ సంఘటన ధేమాజీ జిల్లాలోని ఉదయపూర్ మేచకి సపోరి ప్రాంతంలో జరిగింది. అస్సాంలోని నేషనల్ హెల్త్ మిషన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఉదయ్ పూర్ మెచకి సపోరి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల గర్భవతి ఒక పడవలో ప్రసవిన్చారని పేర్కొంది. పఖోరిగురి సపోరి అనే గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడానికి గానూ ఒక పడవ వెళ్తుంది. ఆమెను గమనించి ఉదయపూర్ వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళాలి అని సూచించారు.
అదే పడవలో ఉన్న వైద్య అధికారి ఒకరు ఆస్పత్రి దూరంగా ఉంది కాబట్టి సమయం వృధా చేయకుండా పడవలో కాన్పు చెయ్యాలని భావించారు. పడవ క్లినిక్‌లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు క్లిష్ట పరిస్థితుల్లో కాన్పు చేసారు. ఆ సమయంలో అక్కడ అన్ని విధాలుగా పరిశుభ్రత పాటించాం అని, పడవను ముందు శుభ్రం చేసామని.. గ్లౌజులు కూడా వాడి అప్పుడు కాన్పు చేయించామని పేర్కొన్నారు. కాగా ఆ గ్రామం చుట్టూ నదే ఉంటుంది