పరశురామ జయంతి ప్రత్యేకం : పరశురాముడికి గొడ్డలి అయుధంగా ఇచ్చిందెవరో తెలుసా ?

-

పరశురామడు రజోగుణ స్వభావం తీవ్రంగా ఉండేది. ఒకసారి పరశురాముడు తన తాత ఋచీక మహర్షి దగ్గరకి వెళ్ళగా అతని వైఖరి గమనించిన ఋచీక మహర్షి శివుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు. తాత ఆజ్ఞ ప్రకారం పరశురాముడు శివుడి గురించి ఘోరతపస్సు చేయగా సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అన్నాడు. తనకు రౌద్రాస్తం ప్రసాదించమని పరశురాముడు వరం కోరుకున్నాడు. దానికి పరమశివుడు అంత అస్త్రాన్ని ధరింపగల శక్తి లేదని అన్నాడు. పరశురాముడు తిరిగి తపస్సు కొనసాగించాడు. అదే సమయంలో రాక్షసులు దేవలోకంపై దాడి చేయగా, దేవతలు తమను రక్షించమని పరమేశ్వరుడిని కోరారు. పరమేశ్వరుడు, పరశురాముడిని రప్పించి రాక్షసులను తరిమేయమని ఆజ్ఞాపించాడు.

దానికి పరశురాముడు తన వద్ద ఆయుధం లేదని తెలుపగా పరమేశ్వరుడు ఒక పరుశువు (గొడ్డలి)ని బహుకరించాడు. పరశురాముడు రాక్షసులను తరిమివేసి తిరిగి తపస్సులో కూర్చున్నాడు. పరమేశ్వరుడు మరొకసారి ప్రత్యక్షమై పరశురాముడు కోరిన అస్త్రాలను ఇచ్చాడు. కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడు ఇంట్లో లేకుండటం చూసి జమదగ్ని తలను నరికి తమ వెంట రాజధానికి వెళ్ళిపోయారు. రేణుక జమదగ్ని శవంపై పడి రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంది. పరశురాముడికి ఈ విషయం తెలిసి కార్తవీర్యార్జనుడి కుమారులను సంహరించి తండ్రి జమదగ్ని తలను తీసుకువచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. పరశురాముడు క్షత్రియ జాతిపై ఆగ్రహంతో వారిపై 21 సార్లు దండెత్తి క్షత్ర్రియ వంశాలను నాశనం చేశాడు.

శ్యమంతక పంచకం అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతోనింపి తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు పరశురాముడు. కొంత కాలం తరువాత పరశురాముడు భూమిని కశ్యపుడికి దానం ఇచ్చి తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు. అందుకే భూమికి ‘కాశ్యపి’ అని పేరు వచ్చిందట. పరశురాముడు చిరంజీవి, కల్కి అవతారానికి విద్యలు ఉపదేశిస్తాడనీ తరువాత మన్వంతరంలో సప్తర్షులలో ఒకడు అవుతాడు. ఈ మహా అవతార మూర్తి విశేషాలు స్మరించుకుంటే సకల పాపాలు పోతాయని పండితోక్తి.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news