తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లారీ డ్రైవర్ల అలజడి మొదలయింది. వీళ్ళు దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ వచ్చి ఇంటి దగ్గర సైలెంట్ గా ఉండటం ఇప్పుడు కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా మారింది. లాక్ డౌన్ లో ఖాళీ గా ఉండి ఎం చెయ్యాలో అర్ధం కాని లారీ డ్రైవర్ విజయవాడలో 25 మందితో కలిసి పేకాట ఆడాడు. ఆ 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ లారీ డ్రైవర్ కి తర్వాత కరోనా లక్షణాలు బయటపడగా..
అతని కాంటాక్ట్స్ ని బయటకు తీయగా ఈ విషయం బయటపడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్ శనివారం తెలిపారు. మరొక ట్రక్ డ్రైవర్ కూడా ఇదే చేసాడు. అతని కారణంగా 15 మందికి కరోనా సోకింది. ఈ రెండు సంఘటనలు కారణంగా గత రెండు రోజులలో నగరంలో సుమారు 40 కేసులకు కారణమయ్యాయని ఆయన చెప్పారు. కృష్ణ లంక ప్రాంతంలోని ట్రక్ డ్రైవర్ బోర్ కొట్టి పేకాట ఆడాడు.
దీనితో వారికి సంబంధం ఉన్న అందరిని క్వారంటైన్ కి తరలించారు. ఇక కృష్ణా జిల్లా నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, అలాగే చక్రాయి గూడెం, తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు ఇలాగే నమోదు అవుతున్నాయి. ఉత్తరాంధ్ర లో కూడా ఇలాగే లారీ డ్రైవర్ల నుంచి కరోనా వచ్చింది. ఎక్కువగా వీళ్ళు మహారాష్ట్ర, బీహార్ వెళ్లి వచ్చారు. వారి అందరికి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి.