గత ప్రభుత్వ నిర్వాహకం వల్లనే పనులు పెండింగ్.. ఎంపీ సీఎం రమేష్

-

అనకాపల్లి రైల్వే స్టేషన్ ను ఆరు నెలల్లో ఆధునీకరిస్తామని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్  పేర్కొన్నారు. అనకాపల్లి స్టేషన్ అధికారులతో సమీక్ష జరిపారు.  వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను నూతనంగా తీర్చిదిద్దుతున్నదని, విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అనకాపల్లి రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరిస్తున్నామని తెలిపారు.


ఇక్కడ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించామని, స్టేషన్ లో పెండింగ్ లో
ఉన్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. అలాగే రెండు మూడు రోజుల్లో మరో సమావేశం ఏర్పాటు చేసి ఆరు నెలల్లో అన్ని సమస్యలు పూర్తి చేసి, పూర్తిగా ఆధునీకరించేందుకు ప్రణాళికలు చేస్తామని తెలిపారు. ఇక గత ప్రభుత్వం  పుణ్యమా అని కొన్ని పనులు పెండింగ్  లో పడ్డాయని ఆరోపించారు. 2014 నుంచి 2019 మధ్యలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు చాలా వరకు పూర్తి చేసి, కాంపెన్జేషన్ డబ్బు డిపాజిట్ చేస్తే.. గత ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును వెనక్కి తీసుకొని పనులను పెండింగ్ లో పెట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news