చంద్రబాబు పాలన చేతకాక చేతులెత్తేస్తాడని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు పెడుతుండటం పై స్పందించారు ఆయన.. చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అక్రమ కేసులు నిర్భందాలు చిత్ర హింసలు రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెరలేపారని దుయ్యబట్టారు.
అలాగే ప్రజల పక్షాణ ప్రశ్నిస్తున్న వారి పై చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయ క్రీడకు తెర లేపాడని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన ప్రవ్నిస్తున్న వారిపై చంద్రబాబు తనయుడు లోకేష్ చేస్తున్నది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. 40 ఏళ్ల ఇండస్ట్రీ గా చెప్పుకునే చంద్రబాబు పాలన చేతకాక చేతులెత్తేశాడని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.