పొడవైన జడ కనపడితే మంచి పద్యం చెప్దామని గత పదేళ్లుగా ఎదురు చూస్తున్నాను. జడ కనపడితే ఒట్టు, అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. తోటకూరో, గొంగూరో అయినా పర్వాలేదు అన్ని కొత్తిమీర కట్టలే.” ఉపన్యాసాలు ఇచ్చే గరికపాటి నరసింహారావు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును పాపం జడ మీద, పొడవైన జుట్టు మీద పద్యం చెప్పడానికి అసలు జడ ఎక్కడ ఉంది చెప్పండి.
ఈ రోజుల్లో ఎక్కడో గాని పొడవైన జుట్టు కనపడటం లేదు. అలాంటిది ఒక అమ్మాయి పొడవైన జుట్టుతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. గుజ్జరాత్ లోని అరవిల్లి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల నిలాంశి పటేల్ గిన్నీస్ రికార్డుల్లో.. తన రికార్డు తానే తిరగరాసి సంచలనం సృష్టించింది. ప్రపంచంలో అతి పొడవైన జుట్టు ఉన్న యువతిగా నిలాంశి రెండోసారి గిన్నీస్ రికార్డులకెక్కింది.
గతంలో 2018లో 170.5 సెంటిమీటర్లతో నిలాంశికి గిన్నీస్ రికార్డు రాగా, తాజాగా, 190 సెంటిమీటర్లతో తన రికార్డును తానే తిరిగరాసి గిన్నీస్ రికార్డ్ ని పలకరించింది. దీనిపై స్పందించిన ఆ అమ్మాయి, నేను ఎక్కడికి వెళ్లినా అంతా నాతో సెల్ఫీలు దిగుతుంటారని, ఇదంతా చూస్తుంటే తాను ఓ సెలబ్రిటీ అని అనిపిస్తుందని ఆమె పేర్కొంది. పాపం ఈ జడ చూసి అయినా సరే గరికపాటి గారు పద్యం చెప్తారేమో చూడాలి.