వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు తెచ్చింది : దగ్గుబాటి పురందేశ్వరి

-

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో 11 మంది నేతల బృందం శుక్రవారం కలిసింది. ఈ క్రమంలో 13 అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.ఆర్‌బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలు ,గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు ప్రకటించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ .. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చింది అని మండిపడ్డారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్‌లు, గుత్తేదారులకు బిల్లులు కూడా ఇవ్వలేదు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులను దారి మళ్లించారు అని ధ్వజమెత్తారు..మద్యంపై భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపి అప్పులు చేశారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగే హక్కు గవర్నర్‌కు ఉంది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల వివరాలు కావాలని కోరాం అని తెలిపింది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా నచ్చిన వచ్చిన వారికి ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించారు” అని ఆరోపించారు పురందేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news