నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు: సీఎం కేజ్రీవాల్

-

ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. ‘ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరతాను. ఈసారి వారు నన్ను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. అయినా నేను చలించను. మీరు జాగ్రత్త. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు. సంక్షేమ పథకాలన్ని కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు. నన్ను జైల్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news