GET READY : ఇవాళ సాయంత్రం 4 గంటలకు వారసుడు సెకండ్ సింగిల్

-

 

విజయ్ దళపతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. ప్రస్తుతం “వారసుడు” అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది.

తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌ ఈ సినిమాను వ్యతిరేకించినా.. సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తామని మరోసారి దిల్‌ రాజ్‌ టీం ప్రకటించింది. అయితే, తాజాగా ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ పై అప్డేట్‌ ను వదిలారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version