రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం బాగా చల్లబడింది. జనం చలికి వనికిపోతున్నారు. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పూట జనం బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రతతో జిల్లాలో పొలం పనులకు వెళ్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో మంచు కమ్మేసింది. ఎల్బీనగర్, హమత్ నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, నాగోల్ ప్రాంతాల్లో కమ్మెసిన మంచుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో ఆదివారం (డిసెంబర్ 4) తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాంతో సోమవారం (డిసెంబర్ 5) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడనుందట. ఇక డిసెంబర్ 7 ఉదయం నాటికి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందట.