అల్లు రామలింగయ్య కి అల్లు అరవింద్ అన్యాయం చేశాడా..?

-

ప్రస్తుతం ఆహా లో బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తుండడంతో మొదట్లో అందరూ అనుమానాలు వ్యక్తం చేసినా.. ఒక్కసారి స్టేజిపైకి అడుగు పెట్టిన తర్వాత షో తలరాత మారిపోయింది. ఆహా కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే రెండవ సీజన్ కూడా మొదలైంది. ఇప్పుడు రెండవ సీజన్ 5వ ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ దర్శకులు , నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అల్లు అరవింద్ తోపాటు సురేష్ బాబు, కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ.. మా తండ్రులు.. మా గురించి మీకు ఏం చెప్పారో చెప్పాలి అని రాఘవేంద్రరావును కోరారు బాలకృష్ణ.. దానికి అల్లు అరవింద్. స్పందిస్తూ మా నాన్న ఎప్పుడు తిట్టేవాడు అంటూ తెలిపారు.. వెంటనే రాఘవేంద్రరావు అందుకొని.. అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి ..ఇది మా ఫ్యామిలీ మేటర్.. మీరు మా నాన్నకు వేషాలు ఇవ్వకండి.. ఆయనకు వయసు పైబడింది అని చెప్పి వెళ్ళేవారు అంటూ తెలిపారు రాఘవేంద్రరావు.

ఆయనకు వయసు పైబడిన నేపథ్యంలో అవకాశాలు ఇవ్వద్దండి అంటూ అల్లు అరవింద్ తనతో చెప్పేవారు అని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఒకవేళ అల్లు అరవింద్ వెళ్లిపోయిన తర్వాత అల్లు రామలింగయ్య రాఘవేందర్రావు దగ్గరికి వచ్చినప్పుడు విషం లేదని చెబితే..” ఏంటి? మా వాడు వచ్చాడా? అని.. నాకు తెలుసు వాడే నాకు వేషం ఇవ్వద్దని చెప్పి ఉంటాడు..” అని అల్లు అరవింద్ ని తన తండ్రి అల్లు రామలింగయ్య ఫుల్లుగా తిట్టేవాడట. అలా సినిమాల విషయంలో అల్లు రామలింగయ్య కి అవకాశాలు లేకుండా చేసి ఆయనకు అన్యాయం చేశాడు అల్లు అరవింద్ అంటూ నవ్వుతూ చెప్పాడు రాఘవేంద్రరావు. ఈ విషయం చెప్పగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక వీటితోపాటు ఎన్నో విషయాలను దర్శకేంద్రుడు పంచుకోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version