కిన్నెర సాని థీమ్.. రహస్యాన్ని శోధించే పనిలో కళ్యాణ్ దేవ్..

Join Our Community
follow manalokam on social media

విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న చిత్రం “కిన్నెరసాని”. ఈ చిత్ర గ్లింప్స్ వీడియో రిలీజై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. తాజాగా కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా కిన్నెర సాని థీమ్ ని రిలీజ్ చేసారు. రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజైన ఈ థీమ్ చాలా కొత్తగా ఉంది. మంటల్లో కాలిపోతున్న కాగితం రోడ్డు మీద పడి అందులో నుండి అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. ఐతే ఆ ఫోటోలో అమ్మాయి ఎవరనే విషయం మాత్రం తెలియదు.

థీమ్ వీడియో చూస్తుంటే మర్డర్ మిస్టరీ లాగా ఉందని అర్థం అవుతుంది. చివర్లో కళ్యాణ్ దేవ్ లుక్ భయం కలిగించేలా ఉంది. మొత్తానికి పూర్తి భిన్నమైన కాన్సెప్ట్ తో కళ్యాణ్ దేవ్ కొత్తగా కనిపిస్తున్నాడు. థీమ్ వీడియోకి వచ్చిన నేపథ్యం చాలా బాగుంది. అశ్వద్ధామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ కిన్నెరసాని చిత్రానికి దర్శక్మత్వంవహిస్తున్నాడు. ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...