ఉప్పెన సినిమాపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఆ రెండు సినిమాలతో పోలుస్తూ..

Join Our Community
follow manalokam on social media

మహమ్మారి తర్వాత ఒక సినిమా గురించి ఇంత పెద్ద ఎత్తులో చర్చలు జరగలేదు. అదే పనిగా ఒక సినిమా గురించి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. సినిమా రిలీజ్ కి ముందే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలూ తక్కువ. మహమ్మారి వచ్చి ప్రేక్షకులని థియేటర్లకి రాకుండా చేస్తే వాళ్ళందరికీ ఆసక్తి కలిగించి మళ్ళీ థియేటర్ల వైపు చూసేలా చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఉప్పెన అని చెప్పవచ్చు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.

మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రంగస్థలం లాంటి సినిమా అని చెప్పాడు. మట్టిలోంచి వచ్చిన కథల అవసరం చాలా ఉందని అన్నాడు. తాజాగా అవే మాటలని పవన్ కళ్యాణ్ రిపీట్ చేసాడు. ఉప్పెన చిత్రాన్ని ప్రశంసిస్తూ రంగస్థలం, దంగల్ సినిమాల మాదిరిగా ఉందని, మన నేటివిటీకి తగినట్లుగా కథలొస్తే ఎంత బాగుంటుందో ఉప్పెన గురించి విన్నాక తెలిసిందని, మున్ముందు ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల అవుతుంది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...