బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో తన ఫోటోలు, ఫ్యామిలీ వీడియోలను షేర్ చేసుకునే అనసూయ అప్పుడప్పుడు నెటిజన్స్ తో అస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది . ఇక తాజాగా అనసూయ సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోని ఒక నెటిజన్ అనసూయను ఇరుకును పెట్టే ప్రశ్న సంధించాడు..
మీరు నిజంగా మెచ్యూర్డ్ , లిబరల్ ఉమెన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి.. మీకు లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అని అనసూయను సూటిగా ప్రశ్నించాడు.. ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా సెలబ్రిటీలకు కాస్త చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. బుద్ధి ఉందా అని ప్రశ్నిస్తారు. కానీ అక్కడ ఉన్నది అనసూయ.. అందుకే చాలా ధైర్యంగా, బోల్డ్ గా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మా ఫ్యామిలీ , ఫ్రెండ్స్ లో చాలామంది గే లు ఉన్నారు.. అయితే పర్సనల్ గా నాకు లెస్బియన్ ఎక్స్పీరియన్స్ మాత్రం కాలేదు. కానీ ఆన్లైన్ లో మాత్రం చాలాసార్లు అనుభవాన్ని ఎదుర్కొన్నాను.. అంటూ ధైర్యంగా, ఓపెన్ గా ఆన్సర్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
ఆ సమాధానం చూసి నెటిజన్లు కూడా షాక్ అవ్వుతున్నారు. ఇంత ఓపెన్ గా ఆన్సర్ చేసింది ఏంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.. సాధారణంగా నెటిజన్లు ఇలాంటి విషయాలపై కామెంట్లు చేస్తే ఆమె చాలా ఫైర్ అవుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబం జోలికి వస్తే అసలు ఊరుకోదు.. అలాంటిది ఈ ప్రశ్నకు ఇంత కూల్ గా ఆన్సర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.