ఆ చిన్న సినిమాలో పెద్ద సందేశం ఉంది.. బన్నీ కామెంట్..?

-

ఎంతోమంది దర్శకులు తమ దగ్గర ఉన్న ప్రతిభను చాటుకోవడం చిన్న చిన్న సినిమాలతో అయిన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా వచ్చిన చిన్న సినిమాలు స్టార్ హీరోల ప్రశంసలు అందుకున్నాయి అంటే దానికి అంతకంటే ఇంకేం కావాలి. ఇటీవలే ఓ చిన్న సినిమా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసించారు. ఇటీవలే పలాస 1978 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా స్టోరీ పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రశంసలు కురిపించాడు. పలాస 1978 సినిమా తనకు ఎంతగానో నచ్చిందని.. వ్యక్తిగతంగా ఈ సినిమా తన మనసును తాకిందని… సినిమాలో ఎంతగానో అంతర్లీన సందేశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ తెలిపిన బన్నీ.. ఆ తర్వాత దర్శకుడిని కలిసి అభినందించినట్లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news