‘బీజేపీలో నాపై కుట్ర జరుగుతోంది ‘ : ఈటెల రాజేందర్

-

పార్టీ మార్పుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదని, తాను గతంలో చెప్పానని, తన లాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన….. తాను పార్టీని వీడి ఎప్పుడు వెళ్లిపోతానో అని ఎదురు చూసేవాళ్లు మా పార్టీలో కూడా ఉన్నారని అన్నారు. ఈటల ఘర్ వాపసీ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా, బీజేపీని వీడి మావైపు వస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటోందని అన్నారు.

 

అధికారంలో ఉండగా కేసీఆర్, కేటీఆర్ లు ప్రధాని మోడీ, అమిత్ షా పై ఎంత అహంకారంతో మాట్లాడారో ఇప్పటికీ కళ్లముందు కదులాడుతోందని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయాక నాలుగు ఓట్ల కోసం బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version