తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.జగన్ తెచ్చిన ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తాను వస్తే పరిశ్రమలు వస్తాయని.. జగన్ వస్తే గంజాయి వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. తన ప్రభుత్వంలో సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని వెల్లడించారు.
కేంద్రం సాయంతో ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.తాము అధికారంలోకి వస్తే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలను ఏప్రిల్ నుంచే కలిపి అందిస్తామని తెలిపారు. ‘తల్లికి వందనం కింద ప్రతి మహిళకు రూ.15వేలు,ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచితంగా మూడు సిలిండర్లు’ హామీలు అమలు చేస్తామని పాయకరావుపేట సభలో తెలిపారు.