రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు.తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ…’ మూడు ప్రధాన జలాశయాల్లో నీటి లభ్యత ఉంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం నిధులు విడుదల చేశాం. బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తయ్యాయి అని తెలిపారు. SRSP, ఎల్లంపల్లి, సాగర్లో నీటి నిల్వలున్నాయి. ఏప్రిల్ 2వ వారంలో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.
నిర్వహణ పరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించాలని సూచించారు. ప్రతీ రోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని తెలిపారు. వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆపరేషన్, మెయింటెనెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు .