కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు : ఈటల రాజేందర్

-

ఐదు దశాబ్దాలపైన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గత యూపీఏ హయాంలో ఐదేళ్ళ కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులను మార్చారో మనకు తెలుసునని, మళ్లీ ఇండియా కూటమి పేరుతో అతుకుల బొంతగా పార్టీలను కూడగట్టుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. శనివారం ఆల్వాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. దేశ ప్రధాని మోదీకి ప్రపంచంలోనే ఎదురులేదని, గొప్ప నాయకుడిగా పేరుపొందారని తెలిపారు.

ప్రజలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలనుకుంటే అది అవివేకమని, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే పార్లమెంట్ సభ్యులకు నిధులు అందుతాయని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి శరవేగంగా సాగుతుందని, ప్రధాని మోదీకి భారత ప్రజలందరూ కుటుంబమేనని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు మని ప్రధాని మోదీ అని స్పష్టంచేశారు. ఒక దేశం, ఒకే చట్టం అనే పద్ధతిని ప్రధాని అమలు పరిచారని, ఎంతో కాలంగా ఉన్న కాశ్మీర్ సమస్యను సునాయాసంగా పరిష్కరించారని గుర్తు చేశారు. గతంలో ప్రపంచంలో ఏడవస్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు నాలుగవ స్థానానికి చేరిందని, టెక్నాలజీ అతి వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మేకిన్ ఇండియా నినాదంతో అనేక పరిశ్రమలు ఏర్పడినట్లు ఈటల వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news