సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి మార‌నున్న 8 రూల్స్ ఇవే.. ఎలా ప్ర‌భావం ప‌డుతుందో తెలుసుకోండి..!

-

వచ్చే నెల సెప్టెంబర్ నుండి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. అవి మీ జేబుల‌పై నేరుగా ప్రభావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మార్పులు ప్రతి వ్యక్తిని ప్రభావితం చేయ‌నున్నాయి. పొదుపు ఖాతా, ఎల్‌పీజీ రూల్స్‌, కారు డ్రైవింగ్, అమెజాన్‌, గూగుల్‌, గూగుల్ డ్రైవ్ సేవలపై క్లియరింగ్, ఈపీఎఫ్ రూల్స్‌.. వంటి వాటిల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

these 8 rules will change from september 1st

1. సెప్టెంబర్ 1 నుండి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే మీ కంపెనీ మీ ప్రావిడెంట్ ఫండ్ (PF)ను ఖాతాకు క్రెడిట్ చేయరు. సెప్టెంబర్ 1 కి ముందు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) UAN నంబర్‌తో ఆధార్‌ని లింక్ చేయాల్సి ఉంటుంది.

2. మీరు చెక్కు ద్వారా చెల్లింపులు ఎక్కువ‌గా చేస్తున్నారా ? అయితే సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి చాలా బ్యాంకులు పాజిటివ్ పే ను అమ‌లు చేయ‌నున్నాయి. అంటే రూ.50వేలు అంత‌క‌న్నా ఎక్కువ విలువ ఉన్న చెక్కుల‌కు మీరు పాజిటివ్ పే ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చెక్కులు క్లియ‌ర్ కావు.

3. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్ల‌కు వచ్చే నెల నుండి పెద్ద ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంది. ఆ బ్యాంకు సెప్టెంబర్ 1 నుండి పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 3 శాతం నుంచి 2.90 శాతానికి తగ్గించ‌నుంది.

4. ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు ప్ర‌తి నెలా మారుతుంటాయి. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 1వ తేదీన లేదా ఆ వారంలో ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం .

5. మద్రాస్ హైకోర్టు సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాన్ని విక్రయించినప్పుడల్లా దాని బంపర్-టు-బంపర్ బీమా తప్పనిసరిగా ఉండాలని తీర్పునిచ్చింది. ఈ బీమా వాహన యజమాని, ప్రయాణికుడిని 5 సంవత్సరాల కాలానికి కవర్ చేస్తుంది. బంపర్-టు-బంపర్ ఇన్సూరెన్స్‌లో వాహనం భాగాలు కవర్ చేయబడవు.

6. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సెప్టెంబ‌ర్ 1 నుంచి త‌న స‌బ్‌స్క్రిప్ష‌న్ రేట్ల‌ను పెంచ‌నుంది. బేస్ ప్లాన్ కోసం ఇక‌పై వినియోగ‌దారులు రూ.399 కాకుండా రూ.499 చెల్లించాలి. రూ.899 చెల్లిస్తే కేవ‌లం 2 డివైస్‌లలోనే ఏక‌కాలంలో వీడియోల‌ను స్ట్రీమింగ్ చేయ‌గ‌ల‌రు. రూ.1499 చెల్లిస్తే 4 స్క్రీన్‌ల‌లో వీడియోల‌ను ఏక‌కాలంలో చూడ‌వ‌చ్చు.

7. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌ లాజిస్టిక్స్ ఖర్చును పెంచ‌నుంది. సెప్టెంబర్ 1 నుండి ఇది అమ‌లులోకి రానుంది. 500 గ్రాముల ప్యాకేజీకి రూ.58 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతీయ ర‌వాణా చార్జి రూ. 36.50 గా ఉంటుంది.

8. సెప్టెంబ‌ర్ 1 నుంచి గూగుల్ ప‌లు కొత్త రూల్స్ ను అమ‌లు చేయ‌నుంది. నకిలీ కంటెంట్‌ను ప్రోత్సహించే యాప్‌లు నిషేధించబడతాయి. యాప్ డెవలపర్లు ఎక్కువ కాలం ఉపయోగించని యాప్‌లు బ్లాక్ చేయబడ‌తాయని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నియమాలు మునుపటి కంటే కఠినంగా ఉండ‌నున్నాయి. గూగుల్ డ్రైవ్ యూజర్లు సెప్టెంబర్ 13న కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ పొందుతారు. దీని వ‌ల్ల డ్రైవ్‌ను మ‌రింత సుర‌క్షితంగా యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news