ఈ జంతువులు అచ్చం మనిషిలా ప్రవర్తిస్తాయట, అలానే మాట్లాడతాయట..

-

మనం మనకు తప్ప వేరే ఏ జీవికి మాట్లాడే అవకాశం లేదు..అన్నీ మూగజీవులు అనుకుంటాం కదా..! కానే కాదు. మనకు మాట్లాడుకోవడానికి ఎలా అయితే ఒక భాష ఉందో.. వాటికి కూడా మాట్లాడుకోవడానికి భాష ఉంది. వాటి భాషలో అవి కమ్యునికేట్‌ చేసుకుంటాయి. హైలెట్‌ ఏంటంటే.. ఒకరి భాష ఒకరి అర్థంకాకపోవడమే. మనుషుల భాష జంతువులకు అర్థంకాదు.. అలాగే గేదల భాష కుక్కలకు అర్థంకాదు, కుక్కల భాష పిల్లులకు అర్థంకాదు. కానీ అచ్చం మనిషిలానే ప్రవర్తించే కొన్ని జంతువులు ఉన్నాయట. ఇవి మనుషుల్లానే మాట్లాడతాయట. ఈ విషయాన్ని పరిశోధకుకలే కనుగొన్నారు. ఇంతకీ అవి ఏంటంటే..

లూసీ అనే రెండేళ్ల వయసు కలిగిన చింపాంజీ మానవ శిశువులా ప్రవర్తిస్తోంది. లూసీ టేబుల్ దగ్గర కుర్చి వేసుకొని దర్జాగా మనిషి తిన్నట్లుగా భోజనం చేస్తుంది. దుస్తులు కూడా వేసుకుంటుంది. అప్పుడప్పుడు స్కర్టులు వేసుకుంటుంది. దీనిపై స్టడీ చేయడానికి వచ్చిన పరిశోధకులకు టీ కూడా పెట్టి ఇచ్చిందట. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రైమేట్ స్టడీస్, యూనివర్శిటీ ఆఫ్ ఓక్లహోమా ఈ చింపాంజీని కలిగి ఉంది. డా. మోరిస్ అనే ఒక మానసిక వైద్యుడు టామెర్లిన్ అతని భార్య జేన్‌తో కలిసి నివసిస్తోంది. ఈ చింపాంజీకి అమెరికన్ సంకేత భాషలోని 250 పదాలను నేర్పించారు.

సీల్ హోవర్ : ఈ జాతికి చెందిన ప్రాణి జార్జ్ స్వాలో 1971లో మైనే తీరంలో కనుగొన్నారు. స్వాలోస్ సీల్‌ను తీసుకొచ్చి సురక్షితంగా ఉంచే క్రమంలో అది చేసిన శబ్ధం, మాట్లాడిన మాటలు అచ్చం మనుషుల్ని పోలి ఉందని గుర్తించారు పరిశోధకులు.

ఫ్రాన్స్‌లోని అక్వేరియంలో నివసిస్తున్న 14 ఏళ్ల ఓర్కా (చేప)పై 2018లో బ్రిటీష్, స్పానిష్, చిలీ , జర్మన్ యూనివర్సిటీ పరిశోధకులు తాము పరిశీలించిన విషయాల్ని వికీలో ప్రచురించారు. మనుషులు చేసే పనులను చూసి ఓర్కా అనే డాల్ఫిన్ కూడా అలానే చేస్తుందట. ఓర్కా మనుషులు చేసే శబ్ధాలు, పిలిచే మాటలను అర్ధం చేసుకోగలదు. మొత్తం 17 ప్రయత్నాలలో అన్ని ప్రత్యేకమైన శబ్దాలను అనుకరిస్తుంది. విక్కీ మొదటి ప్రయత్నంలోనే మానవ నిర్మిత ఓర్కా శబ్దాలు, ఉచ్చారణలను ఎంచుకుంది. కానీ తదుపరి ట్రయల్స్‌లో 50% కంటే ఎక్కువ సమయం హలో అని ఉచ్ఛరింగలదు.

అలెక్స్ చిలుక: అలెక్స్ ఒక ఆఫ్రికన్ గ్రే చిలుక అచ్చం మనిషిలాగానే మాట్లాడగలదు. ఈ చిలుకకు వస్తువులు, ఆకారాలు, రంగులతో పాటు పదార్థాల పేర్లతో పాటు వందకు పైగా ఇంగ్లీష్‌ పదాలు కూడా తెలుసట.

సెల్యూలర్‌ ఏనుగులు కూడా మనిషిలా మాట్లాడగలదట. అయితే కోషిక్ అనే పేరు కలిగిన మగ ఏనుగు కొరియన్ మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2012లో దక్షిణ కొరియాలోని యోంగిన్‌లోని ఎవర్‌ల్యాండ్ థీమ్ పార్క్‌లో ఈ జీవి దృశ్యాలు వైరల్‌గా మారాయి. అతను వీడియో చాట్‌లో ఒక పదం (మంచిది) మాత్రమే ఉపయోగించినప్పటికీ, కోషిక్ కొరియన్ పదాలైన “అనియోంగ్” (హలో), “అనియా” (నో), “అంజా” (సిట్), మరియు “నువో” (నిద్ర) వంటి పదాలను చెప్పింది.

బెలూగా వేల్ నాక్: శాన్ డియాగోలోని నేషనల్ మెరైన్ మమల్ ఫౌండేషన్‌లోని శాస్త్రవేత్తలు తిమింగలం మనిషిలా మాట్లాడుతోందని గ్రహించారు. 1984లో బందీగా ఉన్న మగ బెలూగా వేల్ నిజానికి మనిషిలా మాట్లాడింది. మనుషులు చేసే శబ్ధాలను కూడా అనుకరిస్తుంది.

రాకీ ది ఒరంగుటాన్ : రాకీ ఇండియానాపోలిస్ జంతుప్రదర్శనశాలలో ఉన్న ఒరంగుటాన్ కూడా మనిషిలా మాట్లాడుతుందట. డర్హామ్ విశ్వవిద్యాలయం డా. అడ్రియానో లామెరా నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఒరంగుటాన్లు తమ స్వర పరిధిని సర్దుబాటు చేసి గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news