మీరు ఎక్కువ నీరు తాగుతున్నారని తెలిపే సంకేతాలివే..

-

నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని చెబుతుంటారు. మన శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోతే నిర్జలీకరణం ఏర్పడి ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నమాట నిజమే. కానీ మరీ అతి ఎక్కువగా నీళ్ళు తాగడం కూడా సరైన పద్దతి కాదనే విషయం తెలుసుకోవాలి. దీనివల్ల రక్తకణాల్లో సోడియం శాతం తగ్గి ఇతర ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని తెలిపే కొన్ని సంకేతాలని ఇక్కడ చూద్దాం.

మీరు బయటకి వెళ్తున్నప్పుడు మీతో పాటు బాటిల్ నీళ్ళు తీసుకుని వెళ్తూ, అది పూర్తయిపోయినప్పుడల్లా నింపుతూ ఉంటున్నారంటే ఖచ్చితంగా ఎక్కువ నీళ్ళు తాగుతున్నారనే అర్థం. ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల సోడియం శాతం తగ్గి కణాల వాపుకు కారణమవుతుంది.

మీకు దాహం వేయకపోయిన నీరు తాగుతున్నారంటే దానర్థం మీరు ఎక్కువ నీరు తాగుతున్నట్టే లెక్క. దాహం వేసినపుడు నీరు తాగండి. ఎక్కువ నీళ్ళు తాగాలని చెప్పి, మరీ ఎక్కువగా తాగకండి.

మూత్రం కొద్దిగా పసుపు రంగులోకి మారితే మీరు కావాల్సినన్ని నీళ్ళు తాగుతున్నట్టు లెక్క. అలా కాక మరీ స్పష్టంగా పోతున్నట్టయితే మరీ ఎక్కువ నీళ్ళు తాగుతున్నట్టే లెక్క అని వైద్యులు సూచిస్తున్నారు.

ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం, రాత్రి పూట తరచుగా నిద్రలేస్తున్నారంటే అది ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని చెప్పడానికి సంకేతం కావచ్చు.

తరచుగా వికారంగా ఉండడమో, వాంతులు వస్తున్నట్టు అనిపిస్తే మీరు ఎక్కువ నీళ్ళు తాగుతున్నారని అర్థం చేసుకోవాలి.

రోజంతా తలనొప్పి రావడమనేది డీహైడ్రేషన్ వల్ల కలగవచ్చు. అలాగే ఎక్కువ నీళ్ళు తాగినా వస్తుంది. మీరెక్కువ నీళ్ళు తాగుతున్నా తలనొప్పి లేస్తుందంటే దాని కారణమేంటో మీరే అర్థం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news