పొద్దునే నిద్రలేవగానే తల్చుకోవాల్సిన నగరాలు ఇవే !

-

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రాతఃకాలంలో నిద్రలేవగానే కొన్ని పనులు చేయాలని శాస్త్రం చెప్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది పొద్దునే సర్మించుకోవాల్సిన వాటిలో మోక్షనగరాలు ఒకటి. వాటి గురించి తెలుసుకుందాం… సనాతన ధర్మం ప్రకారం అయోధ్య,మథుర, గయ, కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని లేదా మోక్షనగరులని పిలుస్తారు.

“కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి” లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.కాశి, ఆయోధ్య, మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి. ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది. ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది. కచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది. కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం ఒక్కటే. ఈ నగరాలను ప్రాతఃసర్మణం చేస్తే సకల పాపాలు పోవడమే కాకుండా మోక్షం సిద్ధిస్తుందని పురాణవ్యాఖ్య. ప్రతీరోజు ఈ నగరాలను తల్చుకోవడం ప్రారంభించి మంచి ఫలితాలు పొందండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news