సోషల్ మీడియాలో కరోనా వైరస్ విషయంలో ఒక స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుంటే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కఠినం గానే వ్యవహరిస్తున్నాయి.
అయితే సాక్షాత్తు కేంద్ర మంత్రే కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేయడం ఇప్పుడు షాక్ కి గురి చేస్తుంది. కేంద్ర ఆయుష్ శాఖ సహా మంత్రి శ్రీపాద నాయక్ దీనిపై తప్పుడు ప్రచారం చేసారు. ఇటీవల బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కి కరోనా రాగా… ఆయనకు పది రోజుల్లో కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయింది. దీనికి కారణం ఆయుర్వేదం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మన భారతీయ ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా బ్రిటన్ యువరాజుకు కరోనా తగ్గిపోయిందని
బెంగళూరులోని ఆయుర్వేద రిసార్టు నడిపే ఓ డాక్టర్ నుంచి… తనకు కాల్ వచ్చిందని, తాను ఇచ్చిన ఆయుర్వేద ట్రీట్‌మెంట్ వల్లే చార్లెస్ బయటపడినట్లు ఆ డాక్టర్ తెలిపారనీ… వేల ఏళ్ల నాటి మన ఆయుర్వేదంపై బ్రిటన్ నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. దీనిపై స్పందించిన బ్రిటన్ యువరాజు ప్రతినిధి ఎల్లా లించ్. బ్రిటన్‌లోని NHS సూచనల్ని మాత్రమే యువరాజు చార్లెస్ పాటించారనీ, ఇంకేవీ పాటించలేదని లించ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం చెప్పింది నిజం కాదని మన గోవాలోనే స్పష్టంగా చెప్పారు.