ఖాళీ కడుపుతో తినాల్సిన ఆహార పదార్థాలేంటో తెలుసా..?

-

ఖాళీ కడుపు.. అంటే అసలేమీ తినకుండా ఎనిమిది గంటలపాటు ఉండడం. ఒకరోజులో అలా ఉండేది కేవలం నిద్రలో మాత్రమే. ఎనిమిమి గంటలు నిద్రపోతాము కాబట్టి, మనం రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైపోయి కడుపు ఖాళీ అవుతుంది. మరి తెల్లారి లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రోజంతా హుషారుగా ఉంటుంది.

నానబెట్టిన బాదం..

బాదంలో విటమిన్ ఈ తో పాటు మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఐతే బాదం తినడానికి ఒక పద్దతుంది. బాదంని డైరెక్టుగా తినడం వల్ల ఈ విటమిన్లు శరీరానికి అందవు. రాత్రిపూట బాదంలని నానబెట్టి, తెల్లారి లేవగానే దాని పొట్టు ఊడదీసి తినాలి.

తేనె కలిపిన వేడి నీళ్ళు

తేనెలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి. పొద్దున్న లేవగానే వేడినీళ్ళలో తేనె కలుపుకుని తాగితే జీవక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతేకాదు శరీరంలోని విష పదార్థాలని బయటకు పంపించివేస్తుంది.

కిస్మిస్

కిస్మిస్ లలో పొటాషియం, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. బాదంల లాగే వీటిని కూడా నానబెడితే శరీరానికి మంచిది. దీనిలో ఉండే సహజ చక్కెర శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది.

చక్కెర నిల్వలని నియంత్రణలో ఉంచడంలో కిస్మిస్ లు బాగా ఉపయోగపడతాయి.

బొప్పాయి

శరీరంలో ఉన్న విషపదార్థాలని బయటకు తీసివేయడంలో బొప్పాయి ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీరంలో కొవ్వుని తగ్గించి గుండెకి సంబంధించిన రోగాలను రాకుండా చూసుకుంటుంది. ఐతే పొద్దునపూట బొప్పాయి తిన్న 45నిమిషాల తర్వాత మాత్రమే బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version