ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ సెలబ్రెటీ స్టార్స్ వీళ్లే..!!

-

ఇండియా వైడ్ గా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఉంటుంది ఒర్మాక్స్ సమస్థ. ప్రతి నెలలో కూడా మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాను కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. ఈసారి జనవరిలో కూడా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి మొదటి స్థానంలో ఇళయ దళపతి విజయ్ ఉండడం గమనార్హం. వారిసుతో సినిమాని జనవరి నెలలో విడుదల చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక దీంతో ఈ సినిమాతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని ట్రెండీగా నిలిచారు. ఈ కారణంగానే ఇండియా వైడ్ గా జనవరి నెలలో మోస్ట్ పాపులర్ జాబితాలలో విజయ్ పేరు ఉండడం విశేషము. రెండవ స్థానంలో అల్లు అర్జున్ పేరు ఉండడం గమనార్హం. అల్లు అర్జున్ నుంచి ఎలాంటి సినిమా రాకపోయినప్పటికీ పుష్ప షూటింగ్ ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక మూడవ స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు.

పఠన్ మూవీ తో మంచి పాపులారిటీ అందుకున్న షారుక్ ఖాన్ మోస్ట్ పాపులర్ మెయిల్స్ స్టార్స్ జాబితాలో మొదటిసారి అవకాశాన్ని సంపాదించుకున్నారు. ఇక నాలుగవ స్థానంలో ప్రభాస్ ఉండగా, ఐదవ స్థానంలో అక్షయ్ కుమార్, ఆరో స్థానంలో తమిళ హీరో సూర్య, కూడా నిలిచారు. ఏడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా, ఎనిమిదవ స్థానంలో అజిత్ కుమార్, తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ ,పదోవ స్థానంలో యశ్ నిలిచారు. ప్రతి నెలలో కూడా మోస్ట్ పాపులర్ హీరోల జాబితా అని ప్రకటిస్తూనే ఉంటుంది ఒర్మాక్స్ సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news