కులాంతర వివాహం చేసుకున్నవారికి ప్ర‌భుత్వం అదిరిపోయే ఆఫర్..!

-

భారతీయ సమాజంలో ఇప్పటికీ కులాంతర, మతాంతర వివాహాల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. కానీ ఇలాంటి దారుణాలు జరగకుండా. సమాజంలో కులం అనే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సమాజంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కుల వివక్షతను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తుంది.

కులాంతర వివాహం చేసుకున్న వారికి చేయూతగా ప్రభుత్వం వారికి పారితోషకాన్ని అందిస్తుంది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో వారికి ప్రభుత్వం 50 వేల రూపాయలను అందించేది. కానీ ఇప్పుడు ఆ పారితోషకాన్ని ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. కులాంతర వివాహాలను చేసుకోవద్దనే పెద్దలు కూడా ఈ వివాహాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్నితీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కార్యక్రమాన్ని ఈ నెలనుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి ప్రోత్సాహకాలను పెంచుతూ గత నెల 31వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఈ ఆఫర్ ల‌భించ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version