తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఆ ముగ్గురు వీరేనా..?

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితను ఓడించి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల కూడా అరవింద్‌నే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం వరిస్తుందని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది.

గతంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా బలం పుంజుకుంది. ఏకంగా 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తోంది. అయితే త్వరలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని నూతనంగా నియమిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్‌లలో ఎవరో ఒకర్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని సమాచారం అందుతోంది. అయితే మురళీధర్ రావు, రామచంద్రరావు ఇద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారు కావడంతో అరవింద్‌నే ఆ పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

ఇక నిజామాబాద్ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కవితను ఓడించి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల కూడా అరవింద్‌నే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం వరిస్తుందని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే అరవింద్ రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో అంతటి పెద్ద పదవిని ఆయనకు ఇస్తారా..? అని కూడా ఓ వర్గం చర్చిస్తున్నట్లు తెలిసింది. మరి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందో.. మరికొద్ది రోజుల పాటు వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news