వైఎస్సార్సీపీలో ముసలం… ఆ ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య విభేదాలు

1875

ఎమ్మెల్యే ఫోటోను పెద్దగా వేసిన నరేంద్ర అనే వ్యక్తిని ఎంపీ అనుచరులు బెదరించడంతో… ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వెళ్లి ఎంపీ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నెలన్నర అయిందో లేదో అప్పుడే పార్టీలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఓ ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదం రాజుకుంది. గుంటూరు జిల్లాలోని తాడికొండ వైసీపీ నేతల మధ్య ఈ వివాదం బట్టబయలైంది. ఎంపీ నందిగం సురేశ్ ఫోటోను ఫ్లెక్సీలలో చిన్నగా వేసి ఎమ్మెల్యే శ్రీదేవి ఫోటోను పెద్దగా వేశారంటూ ఎంపీ వర్గీయులు మండిపడ్డారు.

ఎమ్మెల్యే ఫోటోను పెద్దగా వేసిన నరేంద్ర అనే వ్యక్తిని ఎంపీ అనుచరులు బెదరించడంతో… ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వెళ్లి ఎంపీ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలోని పలు చోట్ల వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అదే పార్టీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిని తీసుకొచ్చిన క్రమంలో మళ్లీ ఈ వివాదం మరో తలనొప్పిని తీసుకొచ్చినట్టయింది. చూద్దాం… పార్టీలోని అంతర్గత విభేదాలపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో?