సరదాగా మీ కుటుంబం తో ఏదైనా టూర్ వేయాలనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ టూర్ ప్యాకేజీలను చూడాలి. ఐఆర్సీటీసీ టూరిజం ఎన్నో టూర్ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. హైదరాబాద్ నుంచి కూడా అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. రెండు మూడు రోజులు చిన్న ట్రిప్ వేయాలనుకుంటే ఈ ప్రదేశాలు చూసి వచ్చేయచ్చు. అది కూడా రూ.12,000 లోపు. మరి ఇక ఆ టూర్ ప్యాకేజీలను చూసేద్దాం.
పూర్వ సంధ్య టూర్:
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లివచ్చేయచ్చు. తిరుమల లో శ్రీవారి దర్శనం తో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు చూడచ్చు. ఇది మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.4,930 గా వుంది. రైలు టికెట్లు, హోటల్లో వసతి, దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్నీ కూడా ఇందులోనే కవర్ అవుతాయి.
గోవిందం టూర్:
తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా చూసేయచ్చు. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.3,690. ఈ ప్యాకేజీ తో మీరు వీటిని చూసి మళ్ళీ హైదరాబాద్ చేరుకోచ్చు. అలానే ఐఆర్సీటీసీ తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో హైదరాబాద్ నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
షిర్డీ టూర్:
షిరిడీ సాయి దర్శన్విత్ శనిశింగ్నాపూర్ పేరుతో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. సాయిబాబా దర్శనంతో శనిశింగ్నాపూర్ కూడా చూసి వచ్చేయచ్చు. 1 రాత్రి, 2 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ధర విషయానికి వస్తే… ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.9,540.
ఊటీ టూర్:
ఊటీ, కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలు చూసి వచ్చేయచ్చు. ఐఆర్సీటీసీ అల్టిమేట్ ఊటీ పేరుతో దీనిని తీసుకు వచ్చారు. ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,450. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
కోస్టల్ కర్ణాటక:
ఈ టూర్ లో భాగంగా మురుడేశ్వర్, శృంగేరి, ఉడుపి చూడచ్చు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,090. అలానే డివైన్ కర్నాటక పేరుతో కర్నాటకకు మరో టూర్ ప్యాకేజీ కూడా వుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,820.