మన చుట్టూ ప్రపంచంలో అనేక రకాల పువ్వులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పువ్వులు వేగంగా పూస్తాయి. కానీ కొన్ని మొక్కలకు చెందిన పువ్వులు మాత్రం పూయడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి పువ్వుల గురించే. ఈ పువ్వులు పూసేందుకు 12 ఏళ్లు పడుతుంది. ఇంతకీ అవి ఏం పువ్వులు ? ఎక్కడ ఉన్నాయో తెలుసా ?
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్న పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో నీలకురింజి లేదా కురింజి అనే పువ్వులు 12 ఏళ్ల తరువాత ఇప్పుడే పూశాయి. వీటినే స్త్రోబిలాంతిస్ కుంతియానా అని పిలుస్తారు. ఇవి 12 ఏళ్లకు ఒకసారి పూస్తాయి. తమిళనాడులోని అనకర మెట్టు పర్వతాలు, శంతనపర గ్రామ పంచాయతీ పరిధిలోని షాలొమ్ పర్వత ప్రాంతాల్లో ఈ పువ్వులు బాగా విచ్చుకున్నాయి.
#WATCH | Shantanpara Shalom hills under Santhanpara Panchayat in Kerala's Idukki are covered in hues of blue as Neelakurinji flowers bloom, which occurs once every 12 years pic.twitter.com/DyunepahAv
— ANI (@ANI) August 2, 2021
అక్కడ 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కలను పెంచుతున్నారు. 12 ఏళ్ల తరువాత పువ్వులు పూస్తాయి కనుక వాటిని జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ పువ్వులను చూసేందుకు పర్యాటకులకు కూడా అనుమతిస్తుంటారు. కానీ ఈసారి కోవిడ్ వల్ల పర్యాటకులను అనుమతించడం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.