జూలై 1 నుంచి ఈ వస్తువులు బ్యాన్..వాడితే కఠిన చర్యలు తప్పవు..

-

మన దేశంలో రోజు రోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపొయింది.ముఖ్యంగా చెప్పాలంటే ఒకసారి వాడి పడేసే వస్తువులకు డిమాండ్ ఎక్కువ..వాటిని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడంతో ప్లాస్టిక్ వస్తువులను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించబోతోంది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గత ఏడాది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, నిషేధాన్ని ప్రకటించింది.

 

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వచ్చే నెల నుంచి ప్రజలు కొన్ని వస్తువులను ఉపయోగించకూదని పేర్కొంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల కింద – వస్తువుల ప్యాకేజింగ్ నుంచి సీసాలు, పాలిథిన్ బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్, చెత్త బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వాటి ఉత్పత్తులు ఉన్నాయి.ఇయర్ బడ్స్, బెలూన్లకు అంటించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, మిఠాయి స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేటివ్ థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ ప్యాకింగ్ వస్తువులు, ప్లాస్టిక్ ఆహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాక్‌లు, 100 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్, పీవీసీ లాంటి ఉత్పత్తులు ఈ నిషేధం లిస్టులో ఉన్నాయి..ఈ విషయం పై సంభంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేశారు.నిషేధిత వస్తువులను విక్రయిస్తున్నట్లు తేలితే ప్రస్తుతం ఉన్న వాణిజ్య లైసెన్స్‌లను రద్దు చేస్తారు.

ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని CPCB వినియోగదారులను కోరింది. ఉదాహరణకు, ప్లాస్టిక్ బ్యాగ్‌లకు బదులుగా కాటన్ బ్యాగులను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది..సహజ సిద్ధంగా ఉన్న వస్తువులను వాడితే ఆరోగ్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news