సెప్టెంబరులో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తాం : సీఎం జగన్‌

-

విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సమావేశమైన జగన్‌.. తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణకు ఆదేశించారు. బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని వెల్లడించారు. ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని, దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు. ఇవి నిర్థారించిన తరువాత ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన సూచించారు.

YSR Congress President and Andhra Pradesh CM Jagan Mohan Reddy extends  support to Droupadi Murmu -

టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని, 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ విద్యార్థి 9, 10 తరగతుల్లో కూడా పని చేయాలని ఆయన వెల్లడించారు. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించండని, ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా అర్థం అవుతాయని, టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుందన్నారు. జులై 15 కల్లా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news